ప్రతి ఒక్కరూ జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకోవాలి : మల్కాజగిరి కార్పొరేటర్ శ్రవణ్
ఈరోజు మల్కాజగిరి జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో మల్కాజగిరి కార్పొరేటర్ శ్రవణ్ పాల్గొని విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ చదువులో గొప్పగా రాణించి జీవితంలో ఎంతో ఉన్నత స్థాయికి వెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయురాలు సరస్వతి, సత్యలక్ష్మి మరియు పాఠశాల బోధనా సిబ్బంది పాల్గొన్నారు
Share this article in your network!